Header Banner

తిరుపతిలో వైసీపీకి షాక్! కూటమి అభ్యర్థి డిప్యూటీ మేయర్‌గా విజయం!

  Tue Feb 04, 2025 12:55        Politics

ఏపీలో అధికారం కోల్పోయాక వరుస ఎదురుదెబ్బలు తింటున్న వైసీపీకి మన్నిపల్ ఎన్నికలు మరిన్ని షాకులిస్తున్నాయి. రాష్ట్రంలో తాజాగా జరిగిన డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులు ఎక్కడికక్కడ వైసీపీకి ఓటమి రుచిచూపిస్తున్నారు. అదీ విచిత్రంగా వైసీపీ మెజార్టీ ఉన్న కౌన్సిళ్లలో కూటమి అభ్యర్ధులుగా వరుస విజయాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ తిరుపతి కార్పోరేషన్ లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. తిరుపతి కార్పోరేషన్ లో డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఇవాళ కూటమి అభ్యర్ధి మునికృష్ణ విజయం సాధించారు.


ఇంకా చదవండిజగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!


ఇవాళ జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్ధి మునికృష్ణకు 26 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్ధి భాస్కర్ రెడ్డికి 22 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎక్స్ అఫీషియో ఓటర్లతో కలిపి మొత్తం 50 ఓట్లు ఉండగా.. ఇందులో కూటమి అభ్యర్ధికి 26, వైసీపీ అభ్యర్ధి 22 ఓట్లు సాధించారు.దీంతో కూటమి అభ్యర్ధి మునికృష్ణ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. వాస్తవానికి తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక నిన్న జరగాల్సి ఉండగా కోరం లేక వాయిదా పడింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


నిన్న కొందరు వైసీపీ కార్పోరేటర్లను టీడీపీ నేతలు బస్సులో నుంచి కిడ్నాప్ చేసి తరలించుకుపోయారు. వీరిని తమ వైపు తిప్పుకున్నారు. దీనిపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోలేని నేతలు ఆరోపించారు. నిన్న అర్ధరాత్రి కూడా వైసీపీ, టీడీపీ నేతల మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగాయి. చివరికి ఇవాళ కౌన్సిల్ సమావేశంలో కూటమి అభ్యర్ధికే మెజార్టీ లభించింది. దీంతో మేయర్ గా ఉన్న వైసీపీ నేత శిరీష భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు! ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత! ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే..

 

వైసీపీకి షాక్‌ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!

 

ఆ స్టార్ హీరోడైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?

 

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలిఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!

 

తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!

 

సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #mlc #elections #thirupathi #thirumala #todaynews #flashnews #latestupdate